తీన్మార్ మల్లన్న ఓ చోటా నయిమ్.. మనిషి ముసుగేసుకొని అనేక అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నాడని వ్యాఖ్యలు చేశారు క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్. ఈరోజు సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో తీన్మార్ మల్లన్న మాజీ టీం మెంబర్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న అక్రమాలు బయటపెట్టాం.. చట్టం దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు పట్టించాము..మేము చెప్పేటువంటివి ఆరోపణలు కాదు అన్ని వాస్తవాలు.. అందుకే 197cr కింద పోలీసులు అరెస్ట్ చేశారు అన్నారు.
తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు కాదు దందాల గొంతు..లక్ష్మీ కాంత శర్మను బెదిరించి 30 లక్షలు బ్లాక్మెయిలింగ్ చేసాడు. అంతేకాదు లైంగిక వేధింపులు ఉన్నాయి..20 కేసులకు పైగా ఉన్నాయి..ఈ రోజు తీన్మార్ మల్లన్న బాధితులు వరుసగా బయటకు వస్తారు..తమ బాధలు చెపుతారు. ఇక నాగరాజు గౌడ్,దాసరి భూమయ్య , మనోజ్ కుమార్ యాదవ్ మల్లన్నకు బినామీలు.. అలాగే అనేక చానల్స్ లో పనిచేసిన రజనీకుమార్ కూడా బినామీనే.. వీరితో పాటు మల్లన్న అన్న చింతపండు వెంకటేశ్వర్లు పెద్ద బినామీ..సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఈరోజు క్యూ న్యూస్ లో పనిచేస్తున్నాడు అని ప్రవీణ్ తెలిపారు.
అంగీ లాగు సిద్ధాంతం కాదు తొక్క కాదు.. అబద్ధం మాట్లాడితే ,అబద్ధం ఉన్మాదం మారిస్తే,సైకోతనం మారిస్తే తీన్మార్ మల్లన్న.. ఈ దుర్మార్గున్ని కాపాడటానికి కొన్ని మీడియా సంస్థలు తయారైనాయి. అద్దంకి దయాకర్ ప్రభుత్వ కుట్ర అంటున్నారు మీరు ఇలా మాట్లాడటం తప్పు.. తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకు రావడం కరెక్టు కాదు అన్న..తెలంగాణలో ఉన్న విద్యావంతులు ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. బెదిరింపులకు పాల్పడి అరెస్టయితే ఎవరూ మద్దతు తెలపకండి..క్యూ న్యూస్ ఓ యూ ట్యూబ్ ఛానల్.. అది పరమేష్ పేరు మీద ఉంది. ఆయన టీవీ5లో సబ్ ఎడిటర్‌గా చేస్తున్నాడు ఆయన కూడా మల్లన్నకు బినామీగా ఉన్నాడు. నాగరాజూ,తీన్మార్ మల్లన్న అన్న వెంకటేశ్వర్లు వదిన గడ్డి మాధవి వల్ల తమ్ముడు గడ్డి సృజన పేరు మీద క్యూ న్యూస్ ఉంది. వారికి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సలు ఉన్నాయి. మీడియా వాళ్ళు పోలీసులు అరెస్ట్ కు సంబంధించి చిలకల గూడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేసి వార్తలు రాయండి అని చిలుక ప్రవీణ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలను కలుస్తాం అక్రమాలు భయటపెడ్తామన్నారు.
తీన్మార్ మల్లన్న టీం హన్మకొండ జిల్లా చిలుక ప్రశాంత్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలు స్వచ్చందగా రావడం లేదు.. వచ్చినవారికి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తేనే పాదయాత్రలో పాల్గొంటున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అసలు కాదు..ఇందులో దళిత బిడ్డలు ఎక్కువ శాతం పాల్గొన్నారు. చాలా మందికి కరోనా వస్తే పట్టించుకొనే దిక్కు లేదు.. బహుజన వాదం అంటే వచ్చాము..కానీ తర్వాత మోసపోయాం.. డబ్బులిచ్చి ఉద్యమం నడుపుతాడు.. నా ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తే మాదిగ కులం పేరుతో నన్ను దూషించారు.. తీన్మార్ మల్లన్న దందాలు, మోసాలు వివిధ వేదికల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాం. కానీ తీన్మార్ మల్లన్న తప్పులు కుట్రలు వెలికితీసినందుకు నన్ను బయటకు పంపారు. ఇలాంటి క్రిమినల్ మీద ప్రభుత్వం చర్యలు అభినందనీయం అని చిలుక ప్రశాంత్ వ్యక్తం చేశారు.
క్యూ న్యూస్ కెమెరామెన్ చుక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నదని ఈరోజు నిరూపితమైంది. నా మీద ఎన్నో కుట్రలు నిందలు మోపి బయటికి పంపించాడు. కరోనా లాక్ డౌన్ లో తీన్మార్ మల్లన్న ఎన్నో అక్రమ దందాలు చేసాడు.. విత్ ఫ్రూఫ్స్‌తో సహా ఉన్నాయి.. నవంబర్ 29న వాట్సాప్ మెసేజ్ చేసాడు.. నా బండిలో 78 లక్షలు ఉన్నాయని తీసుకురావాలని..దందాలు సెటిల్మెంట్లు ఇదే పని.. తీన్మార్ మల్లన్న ఆఫీసులో మొత్తము సెటిల్మెంట్లు నడుస్తాయి..డబ్బులు ఎవరూ ఎక్కువ ఇస్తే వారి సైడ్ ఉంటాడు. మొదటి నుండి తీన్మార్ మల్లన్న దొంగ అని నేను గుర్తించిన.. బోడుప్పల్‌లో 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు.. ఇలాంటి దొంగను నమ్మి మోసపోకండి.. అన్ని గమనించి బయటికి రావాలి. 10 లక్షలతో పట్టుబడ్డ దాసరి భూమయ్య ఈరోజు మెంబరా.. అని చంద్రశేఖర్ ఆగ్రహించారు.
తీన్మార్ మల్లన్న టీం నల్గొండ, విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాదయాత్రలో నేను కూడా పాల్గొన్న.. ప్రజల్ని మోసంచేసే తీరు కుట్రలు అన్ని గమనించాను..గెలుస్తాడు అన్న నమ్మకంతో పనిచేసాం.. కానీ తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు ప్రజాస్వామ్యము ఉందని నిరూపితమైంది. మల్లన్నకు దళిత వర్గాల పట్ల చిన్నచూపు ఉంది. దళిత వర్గాలను కింద కూర్చోబెట్టి మిగతా కులాలను పక్కన కూర్చోబెట్టుకుంటాడు. రాజ్యాంగ బద్దంగా బుద్ధి చెప్పాలని అనుకున్నాం. అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ రోజు ప్రజాస్వామ్యనికి మంచిరోజు ఇలాంటి నాయకుడు ప్రజల్లో ఉండకూడదని విశ్వనాథ్ తెలిపారు.
తీన్మార్ మల్లన్న టీం మెంబర్ కిషోర్ మాట్లాడుతూ.. బహుజనవాదం అంటున్నాడు అని పాదయాత్రలో పాల్గొనడానికి పోతే మమ్మల్ని కులం పేరుతో చిన్నచూపు చూసారు..వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్నాం..పాదయాత్రలో మమ్మల్ని అవమానపరిచాడు..తీన్మార్ మల్లన్న ఎవరిదగ్గర ఎంత డబ్బులు తీసుకున్నడో మాకు మొత్తం తెలుసు… నీ ఛానల్‌లో మముల్ని దోషులుగా చిత్రీకరించాలను అనుకున్నావు నువ్వే కటకటాల పాలయ్యావు అని వ్యాఖ్యనించారు. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా టీం మెంబర్ అశోక్ మాట్లాడుతూ.. పోలీసులు,ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికింది..మాతో పాటు ఇంకా చాలా మంది వస్తారు తీన్మార్ మల్లన్న అక్రమాలు బయట పెడతామన్నారు.
తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా టీం మంద కిషన్ మాట్లాడుతూ.. నవీన్ పటేల్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పేరు పెట్టుకొని సమాజాన్ని మోసం చేస్తున్నాడు.. ముసుగేసుకున్న దొంగ.. అక్రమాలు,దందాలు ఎన్నో ఉన్నాయి..తీన్మార్ మల్లన్న టీంలో మెదటి నుండి ఉన్నాము..తీన్మార్ మల్లన్న మొదటి నుండి డబ్బులు సంపాదించాలన్నది ఆలోచన.. బోడుప్పల్ లో రెండు కోట్ల బిల్డింగ్‌ను 70 లక్షలకు అక్రమంగా లాక్కున్నాడు.. అమ్మాయిలతో బ్లాక్ మెయిలింగ్..సెటిల్మెంట్లు,దందాలు ఇదే పని..సోషల్ మీడియా టీంలో పని చేసే వాళ్ళకు హుకుం చేశాడు. అత్యంత క్రూరమైన మనుషులు సోషల్ మీడియా సభ్యులు..బావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో అరాచకాలు స్పృస్టిసున్నాడు. జెండా అజెండా ఉండదు..పిచ్చి ముదిరి సైకోలా మారిండు మల్లన్న. ఈరోజు పోలీసులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అని కిషన్ పేర్కొన్నారు..పాదయాత్ర పేరుతో ఇప్పటికే సంపాదించావు మళ్ళీ కోట్లు సంపాదించేందుకు వెళ్తున్నావ్.. నీ దొంగతనాలు కప్పిపుచ్చుకునేందుకి ఇలాంటి వేషాలు వేస్తున్నావ్.. దొంగ నాటకాలు మానేయి.. జీవితంలో ఓ అవకాశం వచ్చింది మారేందుకు మారు.. ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వారిని వెనకేసుకు రావద్దు. తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసి మెం మోసపోయాం..ప్రజలు ఎవ్వరు నమ్మవద్దు..