వినూత్నంగా ప్రచారం చేస్తూ ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్(పీవీపీ). ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ ఆవాక్ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న ఆయన యువకులతో కలిసి బాస్కేట్ బాల్ ఆడుతు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. .
తాజాగా తిరువూరులో వైసీపీ ప్రచారంలో భాగంగా జగన్‌కు ముద్దు పెట్టారు పీవీపీ. వేలాది మంది చూస్తుండగా, తమ అధినేత వైఎస్ జగన్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రచారంలో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు జగన్. యాత్ర సినిమాలోని డైలాగ్‌లు నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ప్రజలకు భరోసానిస్తూ ముందుకుసాగుతున్నారు. అంతేగాదు వైఎస్‌ఆర్ డైలాగ్‌లను మరిపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జగన్ ప్రచారానికి అశేషంగా జనవాహిని తరలివస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

