- Advertisement -
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పా ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహ ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ .
ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్ లో ప్రతిపాదిత స్థలంలో ఏర్పాట్లకు సూచనలు చేసింది DUAC . ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్.ఆంధ్రా భవన్ తో తెలంగాణ భవన్ కలిసి ఉండటంతో పీవీ విగ్రహం ఏర్పాటు సాధ్యం కాదంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు.
ప్రకాశం పంతులు విగ్రహం దగ్గరలో పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎండీఎంసీని కోరింది పీవీ మెమోరియల్ ఫౌండేషన్.రాజ్ ఘాట్ లో పీవీ స్మారకస్థలిని ఏర్పాటు చేయడంతోపాటు భారతరత్న ఇచ్చి గౌరవించిన ఎన్డీఏ ప్రభుత్వం.
Also Read:ఇంటర్నేషనల్ నర్స్ డే …గ్రీన్ ఛాలెంజ్
- Advertisement -

