ప్రభాసే నా క్రష్ – పీవీ సింధు

24
- Advertisement -

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సినిమాల్లో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో పీవీ సింధు స్పందించారు. ప్రస్తుతం తనకు నటించే ఆలోచన లేదన్నారు. నా దృష్టి ఆట మీదేనని, భవిష్యత్ నిర్ణయాల గురించి ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. తన బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని అడగ్గా… బ్యాడ్మింటన్ గురించి తెలిసిన దీపికా పదుకొణె చేస్తే బాగుంటుందన్నారు. అలాగే, పీవీ సింధు యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఓ యూట్యూబ్ ఛానల్‌ కి ఇంటర్య్వూ ఇచ్చిన ఈ స్టార్.. విజయ్‌ నటించిన సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదని చెప్పింది. అయితే ఆ సినిమాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల యాక్టింగ్‌ నాకు చాలా ఇష్టమని.. అలాగే ప్రభాస్ అంటే తన క్రష్ అని మరోసారి పీవీ సింధు వెల్లడించింది. అయితే, అభిమానులు మాత్రం ఆమె కామెంట్స్ పై భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.

మీరు కూడా సినిమాల్లోకి రావాలి. మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలి అనేది మా కోరిక’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో నెటిజన్, పీవీ సింధు.. రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ పోస్ట్ పెట్టాడు. ఐతే, మెజార్టీ ఆడియన్స్ మాత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత బ్యాడ్మింటన్ కోసం ఓ సంస్థ పెట్టి, పేద అమ్మాయిలకు సపోర్ట్ గా నిలిచి.. వారి ఉన్నతికి కృషి చేయాలని పీవీ సింధుని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Also Read:బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?

- Advertisement -