ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం..

235
- Advertisement -

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం పలికింది. ఇజ్రాయెల్‌కు చెందిన సేనియా పోలికార్పోవా విజయం సాధించింది. 21-7, 21-10తో రెండు వరుస సెట్లలో గెలుపొందింది. 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం గమనార్హం. మరోవైపు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మనుబాకర్ 12వ స్థానం, యశస్విని 13వ స్థానంలో నిలిచారు.

ఇక ఒలింపిక్స్‌ మూడో రోజు షూటర్లు నిరాశ పరిచినప్పట్టికీ రోయింగ్, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్​, అర్వింద్ సింగ్ అదరగొట్టారు. పురుషుల లైట్​వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్​-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు జూలై 27న (మంగళవారం) జరగనున్నాయి.

- Advertisement -