చిరకట్టులో ఆకట్టుకుంటున్న పీవీ సింధు..

255
PV Sindhu
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, హైద‌రాబాదీ పీవీ సింధు గత కొన్ని రోజులుగా ప‌లు కార్య‌క్రమాల్లో పాల్గొంటూ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న బ్రాండ్ విలువ‌ను మ‌రింత పెంచుకుంటోంది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు అకట్టుకుంటున్నాయి. బ్యాడ్మింట‌న్‌ జెర్సీలోనే కాకుండా సంప్ర‌దాయ దుస్తుల్లోనూ అంద‌రి మ‌న‌సులూ దోచుకోగ‌ల‌న‌ని ఆమె నిరూపిస్తోంది. తెలుపురంగు చీర‌, దానిపై పూల డిజైన్‌తో ఉన్న చీర క‌ట్టుకుని ఆమె ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ప్రముఖ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ మ‌నీశ్ మ‌ల్హోత్రా ఈ చీర‌ను డిజైన్ చేశారు.

పింక్, బ్లూ, పర్పుల్ థ్రెడ్‌వర్క్‌తో ఈ చీర‌ను మ‌నీశ్ డిజైన్ చేశారు. భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లోనూ క‌న‌ప‌డుతూ అంద‌రి దృష్టినీ త‌న వైపున‌కు తిప్పుకోగ‌ల‌న‌ని సింధూ నిరూపించుకుంటోంది. ప్ర‌స్తుతం పీవీ సింధు ఒలింపిక్స్‌లో త‌న విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డానికి కంపెనీల దృష్టిని ఆక‌ర్షించే ప‌నిలో ఉంది. రెండు రోజుల క్రిత‌మే పోస్టు చేసిన‌ ఆ పూల చీర ఫోటోకు తెగ లైక్‌లు వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏడు ల‌క్ష‌ల మంది ఆ ఫోటోకు లైక్ కొట్టేశారు.

- Advertisement -