ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినప్పటి నుంచి పీవీ సింధు పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మరోసారి సిల్వర్ మెడల్ తో సింధు మెరిసింది. సింధు విజయాల వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి ఎంతో ఉంది. అందుకే గోపీచంద్ కు గురు దక్షిణ చెల్లించుకునేందుకు సింధు సిద్ధమైంది.
కోచ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ షార్ట్ ఫిలింను రూపొందించిందిసింధు . తన బ్యాడ్మింటన్ గురువు పుల్లెల గోపిచంద్‌పై షార్ట్ ఫిలింను తీసి, గోపీచంద్‌కు టీచర్స్ డే గిఫ్ట్‌ను అందించింది సింధు. పీవీ సింధు షార్ట్ ఫిలింను నిర్మించడమే కాకుండా అందులో స్వయంగా నటించడం విశేషం. ఐ హేట్ మై టీచర్ పేరుతో తీసిన షార్ట్ ఫిలింలో తన గురువు గోపీచంద్‌తో ప్రయాణం ఎలా సాగిందో సింధు చూపించింది.
నాకు తగిలిన దెబ్బలకు అతడే కారణం.. అందుకే నా కోచంటే నాకు అసహ్యం.. నా మీద అరుస్తాడు.. నాకు చెమటలు పడుతుంటే చూడ్డం అతడికిష్టం.. నేను కింద పడ్డప్పుడు.. కనీసం శ్వాస తీసుకోలేనంతగా ఉన్నప్పుడు కూడా.. ఇంతేనా నీ వల్ల అయ్యేది.. అంటాడు. అందుకే నా కోచంటే నాకు అసహ్యం. నేను నిద్ర పోయానా.. లేదా.. అన్నది కూడా అతడు పట్టించుకోడు.. అస్సలు వదిలిపెట్టడు.. అందుకే నా కోచంటే నాకు అసహ్యం. కానీ నిజానికి నా కోచ్ నిర్విరామంగా కష్టపడుతుంటాడు. నా కోసం కలలు కంటాడు. నాలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. మన మీద మనకన్నా ఎక్కువ నమ్మకం ఉంచిన కోచ్ లందరినీ ఈ టీచర్స్ డే నాడు అసహ్యించుకుందామంటూ కొనసాగే ఈ షార్ట్ ఫిలింపై మీరూ ఓ లుక్కేయండి మరీ..