పీవీకి భారతరత్న..అందుకున్న పీవీ ప్రభాకర్‌ రావు

26
- Advertisement -

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ అవార్డుల ప్రధానోత్సవం జరుగగా పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న అవార్డు అందుకున్నారు.

దేశంలోని పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులు, ప్రముఖులకు భారతరత్న అవార్డులను కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ , మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ లకు భారతరత్న ప్రకటించింది కేంద్రం.

అద్వానీ మినహా మిగిలిన నలుగురు ప్రముఖుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుమీదుగా భారత రత్న అవార్డులు అందుకున్నారు.

Also Read:వేసవిలో నోరు పొడిబారితే.. ఇలా చేయండి!

- Advertisement -