నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, పివి గారి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ శాసన మండలి చైర్మెన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పి చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి ,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి , మరియు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ,అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ,అసిస్టెంట్ కలెక్టర్ ప్రీతి సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ..దేశంలొ మొట్టమొదటి సారిగా భూ సంస్కరణ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత మన తెలంగాణ ముద్దు బిడ్డ పీ.వీ.నరసింహారావు దని ఆయన గుర్తు చేశారు. పి.వి నరసింహారావు బహుభాషా కోవిదుడని ఆయన 17 భాషలలో అవలీలగా మాట్లాడేవారని సుఖేందర్ రెడ్డి కొనియాడారు. పీ.వి.నరసింహారావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గా పని చేసిన మొట్టమొదటి తెలంగాణ బిడ్డ అని ఆయన గుర్తు చేశారు.కష్టకాలంలో దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన వారిలో పీవీని మించిన వారు లేరన్నారు.తెలంగాణ బిడ్డగా పీవీ చేసిన సేవలను తరవాతి తరాలు గుర్తుంచుకునే విధంగా సంవత్సరం పాటు శత జయంతి వేడుకలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కెసీఆర్ నిర్ణయించటం చాలా గొప్ప విషయమని అన్నారు.