డెన్మార్క్‌లో మాజీ భారత ప్రధాని స్వర్గీయ పీవీ నరసిహా రావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం పీవీ నరసింహారావు వందవ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి భారత దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. యూరోప్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ శ్యామ్ బాబు ఆకుల మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఏడాది పొడువున జరిపించడం శుభ పరిణామం అన్నారు. తెలంగాణకు చెందిన వారు ఎవరైన దేశానికి సేవ చేసి అత్యున్నత స్థాయికి తీసుకువచ్చిన వారిని ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా చరిత్ర పుటల్లోకి ఎక్కించడం చాల అవసరం. లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వెనకకు తిరిగి చుస్తే తెలంగాణకు చరిత్ర అనేదే ఉండదు. శుక్రవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో డెన్మార్క్ నుండి 25 మందిమి పాల్గొన్నాం. మంత్రి కేటీర్ ఆదేశాల మేరకు డెన్మార్క్‌లో పీవీ నరసింహా రావు విగ్రహ ఆవిష్కరణకు కృషి చేస్తాం అన్నారు.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ డెన్మార్క్ అధ్యక్షుడు రాజు కుమార్ కలువల మాట్లాడుతూ.. బహు బాషా కోవిదులు,రూపాయి నోట్ మీద ఉన్న పద్నాలుగు భాషలను మాట్లాడ గలిగిన ఒకే ఒక్క ప్రధాని,భారత దేశ ఆర్ధిక సంస్కరణల సృష్టి కర్త అగు మన తెలంగాణ ముద్దు బిడ్డ ముఖ్య మంత్రిగా మరియు భారత దేశ ప్రధాన మంత్రిగా సేవలు అందించిన అతి కొద్దీ ప్రధాన మంత్రులలో ప్రప్రథములు. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలుపుతూ రైల్వే లైన్‌ను పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు రైల్వే లైను ఏర్పరిచారు. తెలంగాణ ఏర్పడ్డాక మనం దానిని ప్రారంభించి రక పోకలు సాగిస్తున్నం. భారత దేశంలో భూ సంస్కరణలు ప్రవేశ పెట్టి తనకున్న వందల ఎకరాల్ని ప్రజలకే అంకితం చేసిన మహానీయుడు పీవీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆరెస్ డెన్మార్క్ ప్రెసిడెంట్ జయచందర్ గంట,ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రావు కల్వకుంట్ల ,తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ సంతోష్ రావు బోయినపల్లి ప్రసంగించారు.టీఆరెస్ డెన్మార్క్ వైస్ ప్రెసిడెంట్ వెన్నపూ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , ట్రెజరర్ సంతోష్ కుమార్ గంజి,సురేష్ కుమార్ కట్ట ,బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.