దేశ గతిని మార్చిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు

183
puvvada

దేశ గతిని మార్చిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్రంలోని ప్రతీ ఊరికీ పివి గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పీవీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఖమ్మం లకారం సర్కిల్లో పీవీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రంలో మనమే ముందుగా ప్రతిష్టించాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం వారికి దక్కిన అపూర్వ గౌరవం అన్నారు. పివికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పివి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే. పివి శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించడం మన బిడ్డకు మనం అందిస్తున్న నివాళి అన్నారు. ‘పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు.