కార్మికులకు పాదాభివందనం: మంత్రి పువ్వాడ

287
puvvada ajay
- Advertisement -

కరోనా భయాన్ని జయించి , సమాజం కోసం ముందుకొచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం జిల్లా సామాజిక స్పృహ కలిగిన జిల్లా
అన్నారు.

పారిశుద్ధ్య కార్నికులను ప్రపంచం కొనియాడుతోందని…డాక్టర్ల తో సమానంగా , పారిశుద్ధ్య కార్మికుల కాళ్లుగడిగే పరిస్థితి వచ్చిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసు కారణంగా బోనస్ జీతం ఇచ్చారు .. 40 రోజుల లాక్ డౌన్ రోజులలో అనేక మంది దాతలు గొప్ప సాయం చేశారని తెలిపారు.

- Advertisement -