చింతవర్రె బాధితులను ఆదుకుంటాం: పువ్వాడ

147
puvvada
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చింతవర్రె బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలతో జిల్లా కలెక్టరేట్‌లో మాట్లాడిన అనంతరం ఘటనపై ఉన్నతస్ధాయి కమిటీ వేశామని వెల్లడించారు.

ఈ సంఘటనలో నిందితునిపై పోక్సో కేసు పెట్టామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి నిందుతునికి త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలికలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటారని, వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు వారికి ప్రభుత్వం తరుఫున ఇతర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు.

- Advertisement -