- Advertisement -
ఉక్రెయిన్‌తో యుద్దంపై కీలక ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్ధరాత్రి 12 గంటల వరకు కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు.
36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 6, 7 తేదీల్లో యుక్రెయిన్ లో తాత్కాలిక కాల్పులు విరమణ పాటించనున్నారు. వాస్తవానికి ప్రపంచమంతా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటే రష్యాలో మాత్రం జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు.
పుతిన్ కాల్పుల విరమణ ప్రకటనను యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ తప్పుబట్టారు. అదంతా ఉట్టిదేనని … ప్రాపగండ కోసం పుతిన్ ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -