- Advertisement -
అవసరమైతు అణు యుద్ధానికి వెనుకాడబోమని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు అణ్వాయుధాలు వాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే, అప్పుడు తాము కూడా ఆ పరీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అణ్వాయుధం వాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని..మిలిటరీ కోణంలో ఆలోచిస్తే తాము రెఢీ ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు పుతిన్. అణ్వాయుధాలు ఉపయోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని..వాటిని తాము పాటిస్తామని చెప్పారు.
Also Read:మెగాస్టార్ ను వదలని రాజకీయం!
- Advertisement -