- Advertisement -
ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు పుతిన్. ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. అనుకున్నట్లుగానే తమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్… ఉక్రెయిన్ తీరుపై మండిపడ్డారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన మరియుపోల్‌లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని విమర్శించారు.
మూడవ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు సూచించారు.
- Advertisement -