పుష్పరాజ్ పాత్ర చేయాలనుంది:రణ్‌బీర్‌

22
- Advertisement -

గతేడాది టాలీవుడ్‌లో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది పుష్ప సినిమా. ఈ సినిమాతో బన్నీ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో వచ్చిన డైలాగులు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ పొందింది. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై ఆయన ఓ మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ…పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్‌ పోషించినటువంటి పాత్రలో నటించాలని ఉందంటూ కోరికను వ్యక్తం చేశారు. గంగూబాయి కాథియావాడి ఆర్ఆర్‌ఆర్ పుష్ప సినిమాలు ఓ ప్రేక్షకుడిగా నటుడిగా నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకూ పుష్పరాజ్ లాంటి పాత్రలు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని అన్నారు. అయితే గతంలో రణ్‌బీర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. దీన్నిపై తాజాగా క్లారిటీ ఇస్తూ… నేను వెళ్లిన కార్యక్రమంలో చాలామంది పాకిస్థానీ చిత్ర నిర్మాతలు దర్శకులు పాల్గొన్నారు. మంచి కథలు ఉంటే పాకిస్థాన్‌ చిత్రాల్లో నటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని వారు నన్ను ప్రశ్నించారు. సినిమాకు కళకు ఎలాంటి హద్దులు ఉండవని నేను భావిస్తాను. అందుకే ఆ సినిమాల్లో నటిస్తానని చెప్పా. కానీ కొందరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అని రణ్‌బీర్ వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి…

ఫ్లాప్‌లపై అక్షయ్ ఏమన్నారంటే..?

బాలీవుడ్ ని దెబ్బతీస్తున్న రీమేక్స్

మార్చి11న ..’దోచేవారెవరురా’

- Advertisement -