పుష్ప2 డైలాగ్ లీక్ తో కొత్త సమస్య!

35
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 కి సంబంధించి ఇటీవల షూట్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే పుష్ప రాజ్ చెప్పే ఓ డైలాగ్ లీక్ అయింది.ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో లీకయింది. ఆ డైలాగ్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసి సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచాలని మేకర్స్ భావించారు. అయితే మైత్రి టీమ్ నిర్లక్ష్యం కారణంగా డైలాగ్ బయటికి వచ్చేసింది.

అవతార్ 2 తో పాటు పుష్ప 2 గ్లిమ్స్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత జనవరి 1న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు సుక్కు అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారు. డైలాగ్ లేకవ్వడమే దీనికి కారణం. ఆ డైలాగ్ లీక్ వల్ల గ్లిమ్స్ లో వావ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది లేదా గ్లిమ్స్ ఆలోచనే వదిలేయాలి ఉంటుంది.

పుష్ప ది రూల్ 2024 ప్రారంభంలో విస్తృత స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. నిర్మాతలు పుష్ప 2 ని పాన్-వరల్డ్ లెవల్‌లో భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సో పుష్ప 2 గ్లిమ్స్ అసలు ఉంటుందా ? లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి…

చిరంజీవి సెట్‌లో ప్రభాస్

కత్రినా…2022 మోస్ట్‌ సెర్చ్‌డ్ వుమెన్‌

ఢిల్లీ ఘటన కలిచివేసింది:కంగనా

- Advertisement -