- Advertisement -
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ మూవీకి ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జీ శ్రీనివాస్ కన్నుమూశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా మారేడుపల్లి నుండి రాజమహేంద్ర వెళ్తుండగా శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందారు.
దాదాపు 200 సినిమాలకుపైగా స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు శ్రీనివాస్. చిత్ర షూటింగ్ కోసం వెళ్లి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. శ్రీనివాస్ మృతికి పుష్ప టీంతో పాటు చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.
- Advertisement -