కొత్త ట్రెండ్..మార్కెట్లో పుష్ప చీరలు!

160
pushpa
- Advertisement -

సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రెండో పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు రికార్డు క్రియేట్ చేశాయి. పలువురు క్రికెటర్లు సైతం ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేయడంతో మరింత క్రేజ్ రాగా ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నారు కొంతమంది.

సూరత్‌లో చరణ్‌జీత్‌ క్లాత్‌ మార్కెట్‌ సంస్థ పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్టుచేశాడు. ఈ ఫోటోలు వైరల్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్లు రావడం ప్రారంభమైంది.

రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన ‘పుష్ప’ చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.

- Advertisement -