కేరళలో బన్నీ….. ‘పుష్ప’

145
kerala
- Advertisement -

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా పుష్పరాజ్ అనే డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ గా కేరళ వెళ్లనుందట పుష్ప బృందం.

ఈ మేరకు కేరళ అటవీ ప్రాంతంలో భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయట. కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట.

- Advertisement -