రివ్యూ: పుష్ప

576
pushpa movie review
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా సినిమా విడుదలకు ముందు భారీ హైప్ నెలకొంది. మరి ఆ అంచనాలను బన్నీ – సుక్కు అందుకున్నారా లేదా చూద్దాం…

కథ:

రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్), అతని తమ్ముళ్ళకు ఎలా చుక్కలు చూపించాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్)కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు? అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సాంగ్స్, అల్లు అర్జున్ నటన, సాంకేతిక విభాగం. పుష్పరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు బన్నీ. సుకుమార్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. శ్రీవల్లి పాత్రలో రశ్మిక ఒదిగి పోయింది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు. ఇక మంగళం శ్రీనుగా అద్భత నటన కనబర్చారు సునీల్.మంగళం శ్రీను భార్య దక్షగా అనసూయ నటించింది. సమంత ఐటం సాంగ్‌ సినిమాకు మరింత హైప్‌గా మారింది.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ రన్ టైం, క్లైమాక్స్‌. మూడు గంటల రన్ టైమ్ కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అన్ని పాటలూ చార్ట్ బస్టర్స్. మిరోస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. చంద్రబోస్‌ అందించిన పాటలు,రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంప్స్ కలిగిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

అడవులను అడ్డంగా నరికేస్తూ, అక్కడి వృక్ష సంపదను, ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అంశాలతో ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నమైన కథను ఎంచుకుని చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు సుకుమార్. బన్నీ తన నటనతో ఆకట్టుకోగా ఓవరాల్‌కు మంచి కిక్ ఇచ్చే మూవీ పుష్ప.

విడుదల తేదీ: 11/12/2021
రేటింగ్:3/5
నటీనటులు: అల్లు అర్జున్, రష్మికా
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: సుకుమార్

- Advertisement -