పుష్ప‌… అన‌సూయ లుక్ లీక్ !

90
anasuya

అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డెరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఆగస్టు 13న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఇటీవల మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుదల చేసిన క‌న్న‌డ వెర్ష‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది.

తాజాగా యాంకర్ అనసూయకి సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అన‌సూయ షార్ట్ హెయిర్‌తో చాలా డీ గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపిస్తుంది. అన‌సూయ‌ని ఇలా చూసిన ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లంలో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది.