తగ్గేదేలే…పుష్ప భారీ వసూళ్లు!

124
pushpa
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదలై మిక్స్‌ డ్ టాక్‌ను సొంతం చేసుకున్న వసూళ్ల సునామీ మాత్రం ఆగడం లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ…నాలుగోరోజు కూడా మంచి వసూళ్లను రాబట్టాడు. ఒక్క నైజాంలోనే నాలుగవ రోజు 3.45 కోట్ల షేర్ ని రాబట్టింది పుష్ప మూవీ.

ఇప్పటి వరకు నైజాం ఏరియాలో మొత్తం నాలుగు రోజులకి కలిపి పుష్పకి 26.5 కోట్ల షేర్ వచ్చిందట. దీనిని బట్టి చూస్తే బయ్యర్లు లాభాల్లోకి వెళ్ళినట్లే. మరో మూడు రోజుల పాటు ఏ సినిమా పోటీ లేకపోవడం పుష్పకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉండగా మొత్తానికి పుష్పరాజ్ వేట ఫలితం మామూలుగా ఉందని టాక్ నడుస్తుంది.

- Advertisement -