పుష్ప సినిమా పై హిందూ సేవాదళ్ నిరసన

43
pushpa

పుష్ప సినిమాపై హిందూ సేవాదళ్ నిరసన చేపట్టింది. నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద ధర్నా నిర్వహించారు హిందూ సేవాదళ్ నేతలు. అనంతరం డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ ప్రజాపతి మాట్లాడుతూ..పుష్పా సినిమా ప్రమోషన్ లో దేవి శ్రీ ప్రసాద్ హిందుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

హిందువుల మనో భావాలు మనసులో గాయపరిచేలా మాట్లాడారని..ఐటమ్ సాంగ్ ను దేవుడు పాట తో పోల్చడం సిగ్గుచేటు అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను దేవిశ్రీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు రాబోయే నూతన సంగీత దర్శకులను ప్రభావితం చేసేలా ఎలా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవి శ్రీ ప్రసాద్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.