కాకినాడలో ‘పుష్ప’రాజ్‌ సక్సెస్ పార్టీ..

168
- Advertisement -

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఈ నెల 17వ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. తొలి రోజు నుండి వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ పార్టీలను ప్రాంతాలవారీగా నిర్వహిస్తూ వస్తున్నారు.

తొలి సక్సెస్ మీట్‌ను మొన్న తిరుపతిలో నిర్వహించారు. నిన్న ఈ సినిమా సక్సెస్ పార్టీని చెన్నైలో జరిపారు. ఇక రేపు సక్సెస్ పార్టీని కాకినాడలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సక్సెస్ పార్టీలు ఈ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయనే అంటున్నారు.

- Advertisement -