టీఎస్‌ఆర్టీసీ..రాత్రి 8 గంటల వరకే వారికి డ్యూటీ!

30
rtc

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళ కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని సూచించారు.

ఈ మేరకు అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసిన సజ్జనార్..అంతా ఈ దేశాలను పాటించాలన్నారు. ఒకవేళ రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీ వేయాల్సి వస్తే కారణాన్ని హెడ్‌ ఆఫీస్‌కు తెలియజేయాలని తెలిపారు.