‘పుష్ప’ నుండి మరో ఊర మాస్ సాంగ్ వచ్చేసింది..

121
Pushpa
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలకానుంది. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఊర మాస్ స్టెప్పులతో అల్లు అర్జున్ అదరగొట్టాడు. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్‌కు అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, సింగర్ నకాశ్ అజీజ్ పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు రిలీజైన ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -