అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అలాగే వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. ఎందుకంటే బన్నీ గత సినిమా అల వైకుంఠపురములో రెండేళ్ల కిందే సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడి మరీ రూ.25కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
కానీ ఇప్పుడు మాత్రం ఆ వసూళ్లు బీట్ చేయలేకపోయింది. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్నిచోట్ల వసూళ్లు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా హిందీ, తమిళంలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీలో రూ.3.75 కోట్లు గ్రాస్.. తమిళంలో రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.39 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
నైజాం: 11.44 కోట్లు
సీడెడ్: 4.20 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.80 కోట్లు
ఈస్ట్: 1.43 కోట్లు
వెస్ట్: 1.50 కోట్లు
గుంటూరు: 2.28 కోట్లు
కృష్ణా: 1.15 కోట్లు
నెల్లూరు: 1.10 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 24.90 కోట్లు
తమిళనాడు: 1.66 కోట్లు
కర్ణాటక: 3.65 కోట్లు
హిందీ: 1.66 కోట్లు
ఓవర్సీస్: 4.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1 కోటి
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 38.49 కోట్లు