పుష్ప 2 ట్రైలర్ లో ఇవి గమనించారా ?

35
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1. ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనలు క్రియేట్ చేసింది. తెలుగు తరువాత నార్త్ లో పుష్ప మూవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా పుష్ప ది రూల్ ( పార్ట్ 2 ) నుంచి అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా టిజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ టిజర్ లో మూవీకి సంబంధించి కొంత స్టోరీని కూడా రివిల్ చేసింది చిత్రయూనిట్. పుష్ప రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా.. కానీ పుష్ప తప్పించుకోవడంతో పోలీసులు పుష్పరాజ్ పై కాల్పులు జరిపినట్లు టిజర్ లో చూపించారు. అయితే పుష్ప చనిపోయాడా ? లేక బ్రతికే ఉన్నాడా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ టిజర్ లాస్ట్ లో అల్లు అర్జున్ ను చూపించి పుష్ప రాజ్ బ్రతికే ఉన్నట్లుగా టిజర్ లో చూపించారు. .

అంతే కాకుండా ఎర్ర చందనం స్మగ్లర్ గా ఉన్న పుష్పరాజ్ సిండిగేట్ ను మెంబర్ గా ఎదిగి సంపాధించిన డబ్బు అంతా పేదల కోసం ఖర్చు చేస్తున్నట్లుగా టిజర్ ను బట్టి తెలుస్తోంది. అయితే పుష్ప రాజ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తరువాత పుష్ప ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. పుష్పరాజ్ విదేశాలకు పారిపోయాడా లేదా ? అడవిలోకి వెళ్లాడా ? అసలు పుష్పరాజ్ ఎక్కడా ? అనే పాయింట్ ను మెయిన్ గా హైలెట్ చేసింది చిత్రయూనిట్. అయితే టిజర్ ను బట్టి చూస్తే బహుబలి పాట్రాన్ సుకుమార్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే క్యూరియాసిటీ రాజమౌళి ఏవిధంగా అయితే క్రియేట్ చేశాడో అదే విధంగా పుష్పా ఎక్కడ అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్ప పార్ట్ 2 టిజర్ తో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ మూవీ రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

#VT13 గ్వాలియర్ షెడ్యూల్‌ పూర్తి

పిక్ టాక్ : ఘాటు అందాల గుమగుమలండోయ్

మహేష్ తో జక్కన్న.. అప్పటి నుంచేనా?

- Advertisement -