పుష్ప రాజ్ మొదలెట్టాడు

78
- Advertisement -

‘పుష్ప ది రైజ్’ థియేటర్స్ లోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఇంత వరకు పార్ట్ 2 కి సంబంధించి షూటింగ్ అప్ డేట్ లేదు. రీసెంట్ గా రెండు మూడు షెడ్యుల్స్ చేశారు. కానీ బన్నీ మీద కేవలం నాలుగైదు రోజులే కొంత పార్ట్ తీశారు. అదే గ్లిమ్స్ గా వదిలే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి నేటి నుండి భారీ షెడ్యుల్ మొదలైంది. ఇవ్వాళ హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ బన్నీ పాల్గొంటున్నాడు.

పది రోజుల పాటు హైదరాబాద్ లో డిఫరెంట్ లోకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో అలాగే బ్యాంగ్ కాక్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక లొకేషన్ షిఫ్టింగ్ కి ముందు ఎక్కువ గ్యాప్ లేకుండా కేవలం రెండు మూడు రోజులు మాత్రమే బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తాజాగా బన్నీ సుకుమార్ కి ఓ టార్గెట్ ఇచ్చి ఆ లోపు షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పేశాడట.

ఏదేమైనా పుష్ప 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా ? అంటూ ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కి ఎట్టకేలకు అప్ డేట్ వచ్చినట్టే. కానీ అఫీషియల్ షూటింగ్ డీటెయిల్స్ మేకర్స్ బయట పెట్టడం లేదు. అన్నీ గ్లిమ్స్ తోనే చెప్పాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -