‘పుష్ప 2’ పై క్రేజీ న్యూస్

20
- Advertisement -

అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ షూటింగ్ వేగంగా నడుస్తోంది. ఐతే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ వచ్చే వారం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్ లో జరగనుంది. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ రేంజ్ అవుట్ ఫుట్ అందించేందుకు ‘పుష్ప 2’ టీమ్ ఎంతో శ్రమిస్తోందట.

అందుకే, కొన్ని ఫ్లైట్ షాట్స్ ను షూట్ చేసి.. వాటికి మ్యాచ్ అయ్యేలా విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తారట. అన్నట్టు ‘పుష్ప 2’ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అవుతాయని, అల్లు అర్జున్ ఉగ్రరూపం చూస్తారని మొదటి నుంచి చిత్ర బృందం చెబుతుంది. పుష్ప చిత్ర హిట్ కి ఏమాత్రం తగ్గకుండా ‘పుష్ప 2’ ఉంటుంది అంటున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ కూడా అదిరిపోయే BGM ని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఎటు చూసినా పుష్ప 2 పై అంచనాలు భీభత్సంగా కనిపిస్తున్నాయి.

మరి ఆ అంచనాలను ‘పుష్ప 2’ అందుకుంటుందా ?, సుకుమార్ కూడా భారీ స్థాయిలో ఈ సినిమాని తీస్తున్నాడు. ఇక ఈ సినిమా షూట్ మొత్తం ‘మే’ నెల వరకూ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి మూవీ టీమ్ ప్రమోషన్లపై ఫోకస్ పెట్టనున్నారు. కాగా, ఈ మూవీ ఆగష్టు 15న గ్రాండ్‌ గా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!

- Advertisement -