రోడ్డు ప్రమాదంలో పుష్ప2 ఆర్టిస్టులకు గాయాలు

40
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పుష్ప2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుండగా తాజాగా పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి వద్ద పుష్ప-2 ఆర్టిస్టులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి.

Also Read:Superstar Krishna:బర్త్ డే స్పెషల్

షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయాలపాలైన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Also Read:MAY30: గోవా స్టేట్‌హూడ్ డే

- Advertisement -