సాయి రామ్ శంకర్ “రీసౌండ్” చిత్రం ప్రారంభం

267
Puri Sai Ram Shankr.jpeg

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకతం లో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం ‘రి సౌండ్ ‘. శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది . ముఖ్య అతిధులు, మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా . మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో యూత్ ని అలరిస్తున్న ఆకాష్ పూరి కూడా పూజ కార్యక్రమాలలో పాల్గున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ “సాయి రామ్ శంకర్ మళ్ళి రీసౌండ్ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “ఆర్య తో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు రంగస్థలం తో రీసౌండ్ చేసాడు, అతడొక్కడే తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో రీసౌండ్ చేసాడు. మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది . మా సినిమా ప్రారంభానికి వచ్చిన సుకుమార్ గారి కి సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు.