ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. రామ్ హీరోగా తెరకెక్కిన ఈసినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించారు. చార్మీ నిర్మించిన ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక సినిమా తర్వాత పూరీ జగన్నాత్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయనున్నారు.
ఈవిషయాన్ని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది ఛార్మీ. ప్రస్తుతం ఈమూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ , ఛార్మీ నిర్మిస్తున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభించి జులైలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈసినిమా టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూరీ సినిమా ప్రారంభం రోజే టైటిల్ ను ప్రకటిస్తారు. విజయ్ దేవరకొండ కోసం ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. విజయ్ కి కూడా ఈటైటిల్ కరెక్ట గా సెట్ అవుతుందంటున్నారు అభిమానులు.