పూరి ఫైటర్‌ కోసం భారీ సెట్!

185
puri
- Advertisement -

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఫైటర్. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. క్లైమాక్స్ షూటింగ్ కోసం ఓ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ సిద్ధం చేస్తున్నారట. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ సెట్ లో భారీ ఫైట్ సీన్ షూట్ చేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నారట.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి-విజయ్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ ఆశలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు.

- Advertisement -