దర్శకుడు పూరి జగనాథ్ తన నెక్స్ట్ మూవీ తన కొడుకుతోనే ఉంటుందని ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పూరి తనయుడు ఆకాశ్ గతంలో ‘ఆంధ్రాపోరి’ అనే సినిమా చేశాడు. ఆ తరువాత తన తనయుడికి నటన .. డాన్స్ .. ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించడానికి పూరి ఫారిన్ పంపించాడు. ఆ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆకాశ్, తండ్రి దర్శకత్వంలో హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు దర్శకుడు పూరి. హిందూ – ముస్లిం ప్రేమకథతో ఈ సినిమా తీయనున్నాడని సమాచారం. మన దాయాది దేశమైన పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథను తెరకెక్కించబోతున్నాడు. అయితే సాధారణంగా ఇలాంటి సినిమాలు తీసేముందు ఆచితూచి జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మిగతా సినిమాల్లాగా నేనొక్కసారి కమిటైతే నామాట నేను వినను అన్న స్టయిల్లో పూరి ముందుకెళ్లిపోతే సెన్సార్ కత్తెరకు బలయిపోయే ప్రమాదమో వివాదాల్లో నలిగిపోయి నష్టపోవడమో జరుగుతుంది.
అంతే కాదు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా నటించిన టీనేజ్ లవ్ స్టోరీ సినిమా ‘ఆంధ్రా పోరీ’ ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. అందుకే ఈసారి టైటిల్ నుంచే పూరి జగన్నాథ్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకునేది ఇంకా ఫైనల్ కాలేదు. దానిపై ఓ నిర్ణయానికి వస్తే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అయితే రీసెంట్ గా బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా మరోసారి బాలకృష్ణతో సినిమా తీస్తానని చెప్పాడు. కాకపోతే బాలకృష్ణతో మూవీ మొదలుపెట్టడానికి ముందే తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నాడు.