ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసిన పూరి..

210
- Advertisement -

పూరి జగన్నాథ్‌, నందమూరి బాలకృష్ణ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసందే.ఈ మద్య రెగ్యులర్‌ ష్యూటింగ్‌ కూడా ప్రారంభించారు.మరి ఈ సినిమా అప్పుడే ఫస్ట షెడ్యూల్‌ పూర్తి చుసుంకుందట.అది కూడా మాములు డైలగు సీన్‌ కాదట.ఏకంగా భారీ యాక్షన్‌ సీక్వన్స్‌ ను పూర్తి చేశారు పూరి,బాలయ్య. నమ్మటానికి కష్టంగా ఉన్న పూరి స్పీడు తెలిసిన వారు నిజమే అనుకుంటున్నారు.

ప్రారంభోత్సవంలో చెప్పినట్లే.. మరోసారి నందమూరి అభిమానులకు ఈ సినిమా విందే అంటూ మరోసారి నొక్కి వక్కాణించాడు పూరి. బాలయ్య సినిమాను పూరి ఇంత వేగంగా షూట్ చేస్తుండటం అభిమానులకు మహదానందాన్నిచ్చేదే. పూరి స్పీడు చూస్తుంటే అనుకున్నట్లే సినిమాను సెప్టెంబరు 29న రిలీజ్ కు రెడీ చేసేలా ఉన్నాడు. భవ్య క్రియేషన్స్ బేనర్ మీద ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘టపోరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అదెంత వరకూ నిజమో తెలియదు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారవ్వలేదు. ఇందులో నటించే మిగతా నటీనటులెవ్వరూ కూడా తెలియదు. అంతలోనే పూరి తొలి షెడ్యూల్ పూర్తి చేసేయడం విశేషమే.

Puri Jagannath Completed First Schedule

హీరో ఎవరైనా తన స్పీడు తనదేనని రుజువు చేస్తున్నాడు పూరి జగన్నాథ్. నందమూరి బాలకృష్ణతో పూరి సినిమా అనౌన్స్ చేసి నెల రోజులు కూడా కాలేదు.మార్చి 16న షూటింగ్ ప్రారంభించాడు పూరి. ఆ రోజు బాలకృష్ణ ఎనర్జీ సూపర్బ్ అంటూ తొలి రోజు షూటింగ్ అద్భుతంగా సాగిందని ట్విట్టర్లో వెల్లడించిన పూరి ఆ ట్వీట్ చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో ట్వీట్ తో షాక్ ఇచ్చాడు. బాలకృష్ణ 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. భారీ సెట్ లో యాక్షన్ సీక్వన్స్.. ఈ సీన్స్ అందరినీ అలరిస్తాయి. అంటూ ట్వీట్ చేశాడు. పూరి స్పీడు చూస్తుంటే నిజంగానే అనుకున్న సమయం కన్నా ముందే సినిమా పూర్తి చేసేలాగే ఉన్నాడు.

- Advertisement -