జ‌న‌వ‌రి 7న ‘యాత్ర’ ట్రైల‌ర్..

224
Yatra Movie
- Advertisement -

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర పేరుతో బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. క‌న్న‌డ న‌టుడు మమ్ముట్టీ వైఎస్సార్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ ఈచిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర‌పైనే ఈసినిమాలో ప్ర‌ధానంగా చూపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇటివ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్ కు మంచి రెస్పాస్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే రెండు సాంగ్ ల‌ను కూడా విడుద‌ల చేశారు.

Yatra
తాజాగా ఈచిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారరంభించారు. తాజాగా ఈచిత్ర ట్రైల‌ర్ విడుద‌ల తేధిని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 7న సాయంత్రం 5గంట‌ల‌కు యాత్ర ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈమూవీలో ప్ర‌ముఖ న‌టులు జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

- Advertisement -