పూరి…ఇస్మార్ట్ హోమం..!

596
ismart homam
- Advertisement -

చాలాకాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో బంపర్ హిట్ కొట్టాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మితో కలిసి మూవీని నిర్మించిన పూరి…నిర్మాతగాను సక్సెస్‌ సాధించాడు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ. 80 కోట్లు వసూళ్లను రాబట్టింది.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ తీయనున్నాడు పూరి. హిట్ రుచి చూసి చాలాకాలం కావడంతో ఎప్పుడు దేవుడిని నమ్మని పూరి నర్సాపూర్‌లోని అంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక హోమం చేశారు. చార్మితో కలిసి పూరి హోమంలో పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవలె పూరి రేంజ్ రోవర్ వోగ్ కారును కొనగా.. చార్మి బీఎం డబ్ల్యూ 7 సీరీస్ కారును కొన్నారు. ఇక వీరిద్దరు పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కించనుండగా ఈ సినిమాకు ఫైటర్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -