మొత్తానికి బాలయ్య వీక్‌నెస్‌ భయటపడింది..!

212
Puri Jagannadh New Movie with Balakrishna
- Advertisement -

పూరి జగన్నాథ్‌ సినిమాలంటేనే..మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు ముక్కుసూటిగా వెళ్ళే తత్వాన్ని కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన సినిమాలో నటించిన హీరోలు మాస్‌ లుక్‌తో కనిపించేలా మాయ చేస్తాడు పూరి. ఇక పూరి సినిమాలు ఒకెత్తైతే.. వాటిని తెరకెక్కించే పద్ద్తతి మరో ఎత్తు. మిగతా దర్శకులలా సినిమాను పూర్తి చెయ్యడానికి పూరి ఎక్కువ సమయం తీసుకోడు. అదే ఆయనలో ఉన్న స్పెషాలిటి.

ఈ స్పెషాలిటికే పూరికి పడిపోయాడట నటసింహం బాలక్రిష్ట. అయితే ఆ మధ్య బాలయ్యకు పూరి ఓ కథ వినిపించాడట. అంతేకాకుండా పూరి జగన్నాథ్‌తో బాలకృష్ణ సినిమా ఖరారైపోయినట్టే అని వార్తలు కూడా వినిపించాయి. కానీ.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే..కథల విషయంలో జాగ్రత్తలు వహించే బాలయ్య.. పూరి కథ కి ఎలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు? కథకి పడిపోయాడా లేక పూరి కథ చెప్పేవిధానానికి పడిపోయాడా..అనే అనుమానాలు తలెత్తుతున్నాయి బాలయ్య ఫ్యాన్స్‌కి.
Puri Jagannadh New Movie with Balakrishna
కానీ..పూరి కి బాలయ్య ఎలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడో తెలిసిపోయింది. కథ చెప్పిన పూరి జగన్నాథ్‌ నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, అయిదు నెలల్లో ఫస్ట్‌ కాపీ ఇచ్చేస్తానని బాలయ్యకు చెప్పాడట.

అయితే ఇంతకు ముందు మహేష్‌ తో ‘బిజినెస్‌మాన్‌’ చేసిన పూరి, 70 రోజుల్లోనే ఆ సినిమాని కంప్లీట్‌ చేశాడు. ఆ తర్వాత  జూ.ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్‌ ‘ సినిమాని కూడా శరవేగాంగా పూర్తి చేశాడు పూరి. ఇలాంటి సినిమాలు పూరి వేగంగా సినిమాలు తీయగలడు అన్నదానికి నిదర్శనం. బ్యాంకాక్‌ లోనే తన కథలని పక్కాగా రెడీ చేసుకునే పూరి..తాను అనుకున్నట్టుగానే ప్రక్కా ప్రణాళికతో సినిమాలను కూడా పూర్తి చేస్తాడు. అందుకే సినిమా తెరకెక్కించడంలో ఎక్కువ సమయాన్ని తీసుకోడు పూరి జగన్నాథ్‌.

అందుకే…వేగంగా పని చేయడాన్ని ఇష్టపడే బాలకృష్ణ.. పూరి చెప్పిన ఆ షెడ్యూల్‌కి ఫ్లాట్‌ అయిపోయారట. మొత్తానికి  బాలయ్య వీక్‌నెస్‌ తెలుసున్నాడు పూరి. ఇక ఎప్పుడు ఎవరితో సినిమాలు చేసినా తన వేగంతోనే హీరోలని ఆకట్టుకుంటాడు  పూరి జగన్నాథ్‌. నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసేస్తాడనే.. టాప్‌ హీరోలు అతడిని ప్రిఫర్‌ చేస్తుంటారు.

అయితే దసరాకి ఈ సినిమా రిలీజ్‌ చేసుకోవచ్చని బాలయ్య కు.. పూరి కాన్ఫిడెంట్‌గా చెప్పేసరికి, కథ ఆల్రెడీ నచ్చడంతో ఇక నో చెప్పడానికి కూడా బాలయ్య కు కారణమే కనిపించలేదట. మొత్తానికి బాలయ్యను పూరి ఎలా ప్రెజెంట్‌ చేయబోతున్నాడనేది ఖచ్చితంగా బాలయ్య  ఫ్యాన్స్‌ కి ఎక్సయిటింగ్‌ ఎలిమెంటే అని చెప్పొచ్చు..!

- Advertisement -