నానికి 25వ దర్శకుడు ఎవరు…?

270
Nani 25th Movie with Tollywood Top Director
- Advertisement -

ప్రస్తుతం థియేటర్ల వద్ద దుమ్ముదులిపేస్తున్న మూవీ ‘నేను లోకల్‌’. ఇందులో హీరోగా నటించిన నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాచురల్‌ స్టార్ గా తన సత్తా చాటుకుంటూ సినిమా సినిమాకి  ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు నాని.  ఈ ఏడాదిలో ఏ హీరో కూడా చేయనంత స్పీడ్‌ గా తన సినిమాలను కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాడు ఈ నాచురల్‌ స్టార్.
Nani 25th Movie with Tollywood Top Director
నాని ప్రస్తుతం పుల్‌జోష్‌లో ఉన్నాడు. తను నటిస్తున్న అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయాలు సాధింస్తున్నాయి. తాజాగా నాచురల్‌ స్టార్ నటించిన ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకొని ఇప్పుడు కొత్త మూవీలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శివ నిర్వానంద్ డైరెక్షన్లో నాని ప్రస్తుతం 19వ సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలో శరవేగంగా జరుగుతోంది.
Nani 25th Movie with Tollywood Top Director
ఈ సంగతి ఇలా ఉంటే నాని మరో రెండు సంవత్సరాల్లో 25 సినిమాలు కంప్లైట్‌ చేయనున్నాడట. అయితే నాని ఇప్పటి నుంచే తన 25వ సినిమా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన 25వ సినిమా ఎవరితో ప్లాన్‌ చేయాలి అనే దానిపై నాచురల్‌ స్టార్ ఇప్పటికే ఓ ప్లాన్ ని రెడీ చేసుకున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో నాని తన 25వ చిత్రంలో నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కాంబినేషన్ పై నాని భారీ ప్లానింగ్స్ చేశారు. ఈగ మూవీతో తనకి మంచి ఫేం ని క్రియేట్ చేసిన రాజమౌళితోనే నాని తన 25వ చిత్రాన్ని ప్లాన్ ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Nani 25th Movie with Tollywood Top Director
ఓకేవేల రాజమౌళితోనే తన 25వ సినిమాతీస్తే అది ఈగ సీక్వెల్ గా వస్తుందా? మరో కొత్త కథాంశంగా వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి సైతం నానితో మరో మూవీని చేయాలని ఎప్పటి నుండో ఆసక్తి కనబరుచుతున్నాడట.  కొద్ది రోజుల క్రితమే రాజమౌళి నుండి నానికి ఫోన్ కాల్ వచ్చిందని…త్వరలోనే ఓ మూవీ చేద్ధాం అనేది దాని సారాంశం అని ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద న్యాచురల్‌స్టార్‌ నటించబోయే తన 25సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు సమాచారం.

- Advertisement -