తెలుగు చిత్ర పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాత్. ఆయనతో సినిమా చేయడానికి యంగ్ హీరోలు పోటీ పడేవారు. పూరీతో ఒక్క సినిమా చేస్తే చాలు, మాస్ ఇమేజ్ వచ్చేస్తుందని భావించేవారు యంగ్ హీరోలు. ఎంతో మంది హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకువచ్చారు పూరీ. కానీ తనయుడు పూరీ ఆకాశ్ కి మాత్రం హిట్ ఇవ్వలేక పోయారు. ఆకాశ్ తో మెహబూబా సినిమా చేశారు. ఇండో-పాక్ యుద్ద నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచారు.
మెహబూబా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడంతో ఆకాశ్ తో, పూరీ సినిమా ఇప్పట్లో లేదనుకున్నారు. కానీ తనయుడితో మరో సినిమా చేసేందుకు పూరీ సిద్దమవతున్నాడట. ఈ సారి ఎలాగైనా ఆకాశ్ కి హిట్ ఇవ్వాలన్న కసితో ఉన్నాడట పూరీ. ఇందుకు పూరీనే కథను సిద్దం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సైతం పూరీ మరోసారి నిర్మాతగా మారనున్నారని ఫిలింనగర్ లో టాక్. కథ సిద్దం అయిన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్నారట. తనయుడికి హిట్ ఇవ్వాలనుకుంటున్న పూరీ ప్రయత్నం ఈ సారైనా ఫలిస్తుందో..? లేదో వేచి చూడాలి.