ప్రభుత్వాలు,లీడర్స్‌ని అడుక్కోవడం మానేద్దం: పూరి

232
puri
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో కాసింత విరామం దొరకడంతో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా పేదోళ్ల ఓటు హక్కుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు,పేదలకు ఓటు హక్కు తీసేయాలన్నారు.ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలన్నారు.

అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్ట‌డం త‌ప్పు కాదు.పేదోడిగా చావ‌డ‌మే త‌ప్పు అన్నారు.

పుట్టాం కదా గుద్దేస్తాం అంటే.. కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలన్నారు. ప్రభుత్వాలని, లీడర్స్‌ని అడుక్కోవడం మానేద్దాం… ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్ట పడుతుంది లేదంటే చస్తుంది. నీ జాతిని తిడితే నీకు కోపం వస్తుంది కదూ.. మరి అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా?? అని ప్రశ్నించారు.

- Advertisement -