వెంకటేశ్‌తో పూరి జగన్నాథ్‌..!

318
puri jagan
- Advertisement -

టీ టౌన్‌లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుఉతోంది. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో విక్టరీ వెంకటేష్‌ సినిమా చేయనున్నారే వార్త వినిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పూరీ.. వెంకటేష్ కోసం ఒక స్టోరీని సిద్ధం చేసాడని తెలుస్తుంది. వెంకీకి ఈ కథ వినిపించడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది.

పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూరి సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా తర్వాత వెంకటేశ్‌తో సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్నాడట పూరి. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -