పూరి స్క్రిప్ట్ పై కరోనా ఎఫెక్ట్‌

255
puri jagan
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ ఫైటర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుండగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తొలుత అనుకున్న కథను కాకుండా స్క్రిప్ట్‌లో మార్పులు చేసేందుకు సిద్దమయ్యారట పూరి. ఎందుకంటే తొలుత అనుకున్న కాన్సెప్ట్‌ తో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చేయలేని పరిస్థితి. దాంతో స్క్రిప్ట్‌ లో భారీ మార్పులకు పూరి సిద్దం కాక తప్పలేదంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా విజయ్‌…భారీ ఫైట్స్‌ సీన్ ఉండేలా ప్లాన్ చేసిన పూరికి కరోనా కారణంగా విదేశీ ఫైటర్స్‌ దొరకని పరిస్ధితి నెలకొంది. కరోనాతో విదేశాల నుండి నటీ నటులను సాంకేతిక నిపుణలను తీసుకురావడం సాధ్యంకాని పనికావడంతో ఇష్టంలేకున్న స్క్రిప్ట్ మార్చేందుకే సిద్ధమయ్యాడట పూరి

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోండగా పూరి-ఛార్మిలతో కలిసి బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -