మూడోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. పీఎంగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరుగగా 71 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి 5గురు కేంద్రమంత్రులయ్యారు.
అయితే ఏపీ బీజేపీ నుండి పురందేశ్వరి కేంద్రమంత్రి అవుతారని అంతా భావించినా శ్రీనివాస్ వర్మకు ఆ అవకాశం దక్కింది. అయితే పురందేశ్వరిని లోక్ సభ స్పీకర్ చేస్తారనే టాక్ నడుస్తోంది.మహిళా కోటాలో పురందేశ్వరిని స్పీకర్ చేస్తారని తెలుస్తోంది.
వాస్తవానికి స్పీకర్ పదవిని ఆశీంచారు టీడీపీ అధినేత చంద్రబాబు,జేడీయూ నితీష్ కుమార్. అయితే బీజేపీ మాత్రం లోక్ సభ స్పీకర్ పదవిని తమవద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు మోడీ. ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కేసులను నిర్ణయించడంలో స్పీకర్‌ది కీలక పాత్ర. అందుకే ఈ కీలకపోస్ట్‌ను తమవద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు మోడీ. ఇక పురందేశ్వరిని లోక్ సభ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తే ఇది కీలకపరిణామమే అని చెప్పాలి.
Also Read:బాలయ్య బర్త్ డే..BB4 అనౌన్స్