- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తం కాగా కరోనా ప్రభావం మహారాష్ట్ర, కేరళ, గుజరాత్,పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఈనెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని నిర్ణయించింది. మెడికల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో 2 గంటలు పొడిగించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు భయటికి రావొద్దని…రానున్న 2 వారాలు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.
- Advertisement -