పంజాబ్‌లో భీకరమైన కాల్పులు… భక్నా గ్రామస్థులు బయటకు రావొద్దని విజ్ఞప్తి

68
moosewala
- Advertisement -

ప్రముఖ పంజాబీ సింగర్‌ సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితులను పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు చర్యల్ని మరింత ముమ్మరం చేశారు. ఈ కేసుల్లో పరారీలో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందులో భాగంగా అమృత్‌సర్‌ సమీపంలో భక్నా గ్రామంలో బుధవారం గ్యాంగ్‌స్టర్ల్, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు భీకరంగా కొనసాగుతున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్‌ పోలీసు విభాగానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ అ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. మూసేవాలా హత్యకేసుల్లో అనుమానితులుగా ఉన్న ఇద్దరు జగ్‌ రూప్‌సింగ్‌ రూపా, మన్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ మన్నూ కూసాలను పట్టుకొనేందుకు అ ప్రాంతాన్ని చుట్టుముట్టారు పోలీసులు. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మే 29న సిద్ధూను దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

- Advertisement -