గుమ్మడికాయ రసంతో ఆరోగ్య ప్రయోజనాలు

7
- Advertisement -

గుమ్మడి కాయ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దీనిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. గుమ్మడికాయ కర్రీ, సాంబారు, వేపుడు వంటివి ఎంతో మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనికి ఉండే ఒగురు రుచి కారణంగా కొందరికి గుమ్మడి కాయ అయిష్టంగానే ఉంటుంది. ఇక గుమ్మడి కాయను కేవలం వంటల్లో మాత్రమే కాకుండా దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదిలా ఉంచితే గుమ్మడికాయ యొక్క ఉపయోగాలు తెలిస్తే దీనిని తినకుండా అసలు ఉండలేరు.

గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఇ, పీచు వంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరంలోని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో గుమ్మడి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచి గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. ఇక కంటి చూపును మెరుగుపరచడంలోనూ, కంటి సంబంధిత సమస్యలను నివారించడంలోనూ ఇందులో ఉండే విటమిన్ ఇ, ఎంతగానో ఉపయోగ పడుతుంది. గుమ్మడి కాయను ముక్కలుగా చేసుకొని ప్రతిరోజూ జ్యూస్ లా తీసుకోవడం వల్ల మలబద్దకం, అతిసార వంటి సమస్యలు తగ్గిపోతాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. నేటి రోజుల్లో చాలామందికి బీపీని అదుపులో ఉంచుకోవడం ఒక సవాల్ గా మారింది. అలాంటి వారు ప్రతిరోజూ గుమ్మడికాయతో చేసిన కూరలను వారి ఆహారపు డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గుమ్మడికాయ రసంతో కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మూఖ్యంగా ఈ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. అందువల్ల శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుమ్మడికాయ రసాన్ని తప్పనిసరిగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Telangana BJP: తెలంగాణ బీజేపీలో అదే గందరగోళం

- Advertisement -